kondagattu: మల్యాల, డిసెంబర్ 21 (మన బలగం): టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పైడిపల్లి వంశీ తన టీమ్‌తో కలిసి శనివారం ప్రముఖ్య పుణ్యక్షేత్రమైన కొండగట్టును దర్శించుకున్నారు. అంజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆయన వెంట సింగిల్ విండో చైర్మన్ మేనేని రాజనర్సింగరావు, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముత్యం శంకర్, గోల్కొండ రాజు ఉన్నారు. కాగా మున్నా సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన వంశీ 2010లో విడుదలైన బృందానం, 2014లో విడుదలైన ఎవడు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీస్ సూపర్ హిట్ కాగా, ఆయనను స్టార్ డైరెక్టర్‌గా నిలబెట్టాయి.