హాజరైన మానకొండూరు ఎమ్మెల్యే, కలెక్టర్
PHC opening: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) శనివారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. రూ.1 కోటి 56 లక్షలతో పీహెచ్‌సీ భవనాన్ని నిర్మించగా, ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి, దవాఖాన ఆవరణ, ఇన్‌పేషెంట్ గదులు, ఓపీ గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రికి మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బీపీ చెక్ చేశారు. అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, మెడికల్ ఆఫీసర్ శరణ్య పాల్గొన్నారు.