Sri Vaishnava Mahayagam
Sri Vaishnava Mahayagam

Sri Vaishnava Mahayagam: లోక కల్యాణం కోసమే శ్రీ వైష్ణవ మహాయాగం

  • ప్రారంభమైన శ్రీ వైష్ణవ అయుత చండీ యాగం
  • 84వ మహోత్సవానికి వేదికైన నిర్మల్‌
  • శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద సరస్వతి

Sri Vaishnava Mahayagam: నిర్మల్, నవంబర్ 8 (మన బలగం): లోక కళ్యాణం కోసం విశ్వశాంతి మహా యాగ మహోత్సవాలు నిర్మల్ పట్టణంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ యాగంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని నిర్వాహకులు పిలుపునిస్తున్నారు. 18 రోజులపాటు భక్తి ప్రపత్తులతో జరిగే వివిధ రకాల పూజా కార్యక్రమాల్లో పాల్గొని దైవానుగ్రహం పొందాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. 15 రోజులపాటు నిత్య అన్నదాన కార్యక్రమం కొనసాగనుంది. భక్తులు అధిక సంఖ్యలో హాజరుకానుండడంతో సరిపడా ఏర్పాట్లను నిర్వాహకులు చేపట్టారు. 15 రోజులపాటు చేపట్టే నిత్య కార్యక్రమాలను శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ వివరించారు.

10న: ఉదయం ఏడు గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ సూర్య సుదర్శన హోమం, సాయంత్రం 6 గంటలకు శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక కళ్యాణ మహోత్సవం.
11న: సోమవారం ఉదయం ఏడు గంటలకు శ్రీ రుద్ర మృత్యుంజయ సహిత అమృత పాశుపతాస్త్ర హోమం, సాయంత్రం 6 గంటలకు దశ సహస్ర లింగార్చన.
12న: మంగళవారం ఉదయం 7 గంటలకు శ్రీ సుబ్రహ్మణ్య హనుమత్ సహిత అంగారక గ్రహ హోమం, 11 గంటలకు రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం, సాయంత్రం 6 గంటలకు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం.
13న: బుధవారము ఉదయం 7 గంటలకు నక్షత్ర నవగ్రహ ధన్వంతరి హోమములు, సాయంత్రం 6 గంటలకు సహస్ర జ్యోతిర్లింగార్చన.
14న: గురువారం ఉదయం ఏడు గంటలకు శ్రీ కుబేర సహిత మహాలక్ష్మి హోమములు, సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం.
15న: శుక్రవారం ఉదయం ఏడు గంటలకు శ్రీ అష్టలక్ష్మి శ్రీ చండీ హోమములు, 11 గంటలకు శ్రీ రమాచహిత సత్యనారాయణ స్వామి వ్రతములు, సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి విశేష లక్ష కుంకుమార్చన, జ్వాలా దీపోత్సవం.
16న: శనివారం ఉదయం ఏడు గంటలకు శ్రీ సుదర్శన నక్షత్ర నవగ్రహ హోమములు, సాయంత్రం 6 గంటలకు శ్రీ భూనీలా సమేత వేంకటేశ్వర కళ్యాణ మహోత్సవం.
17న: ఆదివారం ఉదయం 7 గంటలకు శ్రీ సూర్య అరుణ హోమములు, శ్రీ సూర్య నమస్కారములు, సాయంత్రం 6 గంటలకు శ్రీకృష్ణ కాలచక్ర యంత్ర లక్ష్య దీపోత్సవము.
18న: సోమవారం ఉదయం ఏడు గంటలకు విశేష శ్రీ రుద్ర పాశుపత హోమములు, సాయంత్రం 6 గంటలకు శ్రీ ఉమామహేశ్వర కళ్యాణ మహోత్సవం.
19న: మంగళవారం ఉదయం ఏడు గంటలకు శ్రీ హనుమత్ సుబ్రమణ్య హోమములు వివాహం కాని ఆడవారికి, మగవారికి ప్రత్యేక హోమములు. సాయంత్రం 6 గంటలకు శ్రీ అభయాంజనేయ స్వామి వారికి లక్ష తమలపాకుల అర్చన.
20న: బుధవారం ఉదయం ఏడు గంటలకు శ్రీ సుదర్శన చండీ హోమంలో సాయంత్రం 6 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహ కళ్యాణ మహోత్సవం.
21న: గురువారం ఉదయం ఏడు గంటలకు శ్రీ మహాలక్ష్మి మరియు అష్టలక్ష్మి హోమములు సాయంత్రం 6 గంటలకు శ్రీ లక్ష పార్థివ లింగములకు విశేషాభిషేక అర్చనలు, రుద్రాక్రమార్చన కోటి బిల్వార్చన.
22న: శుక్రవారం ఉదయం ఏడు గంటలకు విశేష చండీ హోమంలో సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి లక్ష గాజుల అర్చన లక్ష పుష్పార్చన కోటి కుంకుమార్చన.
23న: శనివారం ఉదయం ఏడు గంటలకు విశేష శ్రీ సుదర్శన శతక హోమములు సాయంత్రం 6 గంటలకు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవము.
24న: ఆదివారం ఉదయం ఏడు గంటలకు శ్రీ సూర్య ఆయుష్య హోమములు 11 గంటలకు శ్రీ సీతారామస్వామి వారికి విశేష సహస్ర కళాశాభిషేకము, సాయంత్రము 6 గంటలకు శ్రీ సీతారామ స్వామివారికి పాదుకాపట్టాభిషేకము మహా సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవము.
25న: సోమవారం ఉదయం 11 గంటల 57 నిమిషాలకు మహా పూర్ణహుతి. గురుపూజ, అవబృధ స్నానం, సాయంత్రం 6 గంటలకు శ్రీకృష్ణ ఉట్టి కొట్టుట శ్రీ రాధాకృష్ణ శాంతి కళ్యాణ మహోత్సవము శ్రీ రాధా గోవింద పట్టాభిషేకం మహోత్సవ కార్యక్రమాలతో శ్రీ ఆయుధ చండీ అతిరుద్ర కార్యక్రమం ముగుస్తుంది.

అందరూ ఆహ్వానితులే

కుల, మతాలకతీతంగా లోక కళ్యాణం కోసం నిర్వహించే ఈ హోమ కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చని శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇంతవరకు 83 యాగాలను నిర్వహించినట్లు తెలిపారు. 84వ యాగం నిర్మల్ పట్టణంలో నిర్వహిస్తున్నట్లు స్వామీజీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *