SE Salia Naik: జగిత్యాల ప్రతినిధి, జనవరి 10 (మన బలగం): రాబోవు వేసవి కాలానికి విద్యుత్ డిమాండ్ అనుగుణంగా సరఫరాకు అన్ని రకాల నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని జగిత్యాల సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సాలియా నాయక్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాబోయే వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామ్మన్నారు. విద్యుత్ లోడ్ సమతుల్యంగా ఉంచేందుకు మల్యాల మండల కేంద్రంలో మరో అదనపు 100 కె.వి.ఏ నియంత్రికను ఛార్జ్ చేశామని, దీనీ ద్వారా SS-69/100 కె.వి.ఏ నియంత్రికకు లోడ్ రిలీఫ్ లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జగిత్యాల డివిజనల్ ఇంజనీర్ రాజిరెడ్డి, మల్ల్యాల్ ఏడీఈ మహేందర్, మాల్యాల్ ఏఈ దయానందం, విద్యుత్ సిబ్బంది, వినియోగదారులు ఉన్నారు.