MLA Kalvakuntla Sanjay: ఇబ్రహీంపట్నం, జనవరి 10 (మన బలగం): నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలంలోని ఫకిర్ కొండాపుర్ గ్రామంలో ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి మంజూరు చేసిన రూ.2 లక్షలతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి మరింత కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు గుంటి దేవయ్య, గుంటీ లక్ష్మీ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎలాల దశరథ్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, వైవి నర్సయ్య
గోపిడి లక్పతి రెడ్డి, సున్నం సత్యం, భోనగిరి భూమేశ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.