Sambashiva Temple
Sambashiva Temple

Sambashiva Temple: శ్రీ సాంబశివ దేవాలయంలో మహాశివరాత్రికి ఏర్పాట్లు

Sambashiva Temple: ధర్మపురి, జనవరి 16 (మన బలగం): నేరెళ్ల శ్రీ సాంబశివ దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆలయ పండితులు శివ శ్రీ పర్వతగిరి ప్రశాంత్ శాస్ర్తీ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించనన్నారు. 26వ తేదీ బుధవారం శ్రీ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం, 27వ తేదీ గురువారం మృత్యుంజయ, రుద్రహవనం, రథహోమం, రథబలి, స్వామివారు రథోత్సవం, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. మార్చి1వ తేదీ శనివారం మధ్యాహ్నం 1గంటలకు ఎడ్ల బండ్ల పోటీలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆహ్వాన ప్రతులను ఆలయ కమిటీ సభ్యులకు అందజేసారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కాసరపు రాజగౌడ్, వైస్ చైర్మన్ జాజాల రమేష్, ప్రధాన కార్యదర్శి జాజాల రవీందర్, కోశాధికారి శేర్ల రాజేశం, కార్యదర్శి ఉడుత గంగారామ్, కార్యదర్శి మడిశెట్టి లక్ష్మణ్, ముఖ్య సలహాదారుడు గుంపుల రమేష్, సలహాదారులు కాసరపు బాలగౌడ్, ఇరగదిండ్ల వేణు, వేముల మల్లేశం, పురంశెట్టి సుధాకర్, అరె ప్రసాద్, మాజీ సర్పంచులు పలిగిరి సత్యం పురంశెట్టి రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు కాశెట్టి మల్లేశం, నాయకులు బైరి గణేశ్, బైరి ఎల్లయ్య గౌడ్, వినోద్, మడిశెట్టి విజయ్, మామిడిపెల్లి నారాయణ, పాదం ప్రసాద్, కమిటీ సభ్యులు, శివ దీక్షా స్వాములు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *