Sabarimala Yatra: ఇబ్రహీంపట్నం, జనవరి 2 (మన బలగం): 41 రోజులు కఠోర నియమ, నిష్టలను ఆచరించిన అయ్యప్ప మాలధారుల స్వామి వారి దర్శనం కోసం ఇరుముడితో శబరిమల యాత్ర ప్రారంభించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కేశాపుర్ గ్రామానికి చెందిన అయ్యప్ప స్వామి దీక్షపరులు గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో సౌడల వినోద్ గురు స్వామి ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకొని అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల యాత్రకు ప్రత్యేక వాహనంలో బయలుదేరారు. కార్యక్రమంలో నారికేళ స్వామి నల్ల రాంరాజ్, సతీశ్, శ్రీధర్, సుబ్బయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.