Tex Port Unit
Tex Port Unit

Tex Port Unit: 11న నలుగురు మంత్రులు రాక

  • అపెరల్ పార్క్‌లో యూనిట్ ప్రారంభం
  • కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
  • ఏర్పాట్ల పరిశీలన.. అధికారులకు సూచనలు

Tex Port Unit: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 9 (మన బలగం): సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్‌లో టెక్స్ పోర్ట్ యూనిట్‌ను రాష్ట్ర మంత్రులు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. ఈ సందర్భంగా అపెరల్ పార్క్‌ను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ నెల 11వ తేదీన శుక్రవారం జిల్లా ఇన్చార్జి మంత్రి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆయా శాఖల మంత్రులు పార్కులోనే టెక్స్ పోర్ట్ యూనిట్‌ను ప్రారంభిస్తారని వెల్లడించారు. మంత్రుల రాక సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రారంభమానంతరం సభ నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. కావాల్సిన ఏర్పాట్లను రెవెన్యూ శాఖ అధికారులు, పోలీస్ శాఖ వారు బందోబస్తు ఇతర పనులను చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ రాధాబాయి, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిరిసిల్ల నాయబ్ తహశీల్దార్ విజయ్ భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *