purchasing centers: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 9 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని కంచర్ల, బంజేరు, మద్దిమల్ల, మద్దిమల్ల తాండ, ఎర్రగడ్డ తండా, అడవిపదిర గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను వైస్ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, ఏఎంసీ చైర్మన్ రాములు, సెస్ డైరెక్టర్ మల్లేశం, ఎంపీడీవో అబ్దుల్ వాజిద్, ఏవో జయ, మాజీ ఎంపీటీసీ అరుణ్ కుమార్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి, ఏఎంసీ డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను ఆదుకోవడమే ప్రజా పాలన ప్రభుత్వం లక్ష్యం అని, రైతు శ్రేయస్సు కోసమే ప్రజా పాలన అని తెలిపారు. ప్రతి గింజను కొనుగోలు చేసి రైతును ఆదుకుంటామని అన్నారు.