Jobs: ధర్మపురి, నవంబర్ 14 (మన బలగం): మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎం హెచ్‌వో ప్రమోద్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 9 ఖాళీలు ఉన్నాయని, ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒప్పంద ప్రాతిపదికన (ఎన్‌హెచ్ఎం) ఖాళీలు భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు ఫారం, నోటిఫికేషన్ వివరాలు జగిత్యాల జిల్లా అధికారిక వెబ్‌సైట్ https://jagtial.telangana.gov.in నుంచి పొందాలని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తుతోపాటు అన్ని విద్యార్హతల ప్రామాణిక స్వయం ధ్రువీకృత జిరాక్స్ కాపీలు జతచేయాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, అంగవైకల్యం కలిగిన అభ్యర్థులు రూ.200, ఇతర అభ్యర్థులు రూ.500 డిమాండ్ డ్రాఫ్ట్ రూపములో జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, జగిత్యాల (District Medical & Health Officer, Jagtial) పేరున చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉందని పేర్కొన్నారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, రూమ్ నంబర్ 226, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము (ఐడీఓసీ), జగిత్యాల నందు స్వయంగా సమర్పించాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులు పరిగణింపబడవని, గడువు తేదీ తర్వాత ఎలాంటి దరఖాస్తులు స్వీకరించబోమని స్పష్టం చేశారు.