cooperation week: ధర్మపురి, నవంబర్ 14 (మన బలగం): జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎల్ఎల్ గార్డెన్స్‌లో గురువారం సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 71వ అఖిల భారత సహకార వారోత్సవాల్లో ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా రైతాంగానికి మేలు జరిగే విధంగా సహకార సంఘాలు గాని, సహకార సంఘాల బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. 270కి పైగా సొసైటీల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులపై అదనపు భారం పడకుండా సొసైటీల ద్వారానే మిల్లర్లు వడ్లు కొనుగోలు చేసేలా దృష్టి సారించాలని, దానికి ప్రభుత్వ సహకారం అందిస్తుందని వెల్లడించారు.