Indiramma Housing Scheme: ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా సీపీవో జీవరత్నం అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తనపెల్లి గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, లబ్ధిదారులకు ఇబ్బంది కలుగకుండా పనులు వేగంగా చేయాలని, ప్రభుత్వ సూచించిన సమయంలో పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీవో చిక్యాల రత్నాకర్ రావ్, సిబ్బంది ఉన్నారు.
