Grass cutting accident: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొండకూర్ గ్రామంలో మంగళవారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సంఘం రాజేందర్ (35) విద్యుదాఘాతంతో మృతిచెందాడు. రాజేందర్ ఉదయం పొద్దుటూరి సంజీవ రెడ్డి పొలంలో గడ్డి కోయడానికి వెళ్లాడు. విద్యుత్ మోటార్‌తో గడ్డి కోస్తుండగా కరెంటు షాక్‌కు గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రాజేందర్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన మృతితో కుటుంబం రోడ్డున పడింది. కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలిచివేశాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
