Constitution Protection March: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 8 (మన బలగం): రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ర్యాలీ మద్దిమల్ల, బంజేరు గ్రామాల్లో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఏఐసీసీ, పిసిసి పిలుపు మేరకు వీర్నపల్లి మండలం ఉమ్మడి మద్దిమల్ల గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూత శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహిస్తున్న రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ విలువలను కాపాడాలని ప్రజాస్వామ్యం విలువలతో లౌకికవాదం వర్ధిల్లాలంటూ వాడవాడలా నినాదాలతో పాదయాత్ర కొనసాగింది. బిజెపి బిఆర్ఎస్ పార్టీ రాజ్యాంగాన్ని మార్చేందుకు చీకటి ఒప్పందంతో చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ , మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు నాయక్ మరియు డైరెక్టర్లు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు తిరుపతి యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షులు హరిలాల్ నాయక్ , మాజీ సర్పంచ్ పాటీ దినాకర్ సీనియర్ నాయకులు జజ్జరి నాగరాజు , గ్రామ శాఖ అధ్యక్షులు ఇస్తారి దేవయ్య , నక్క శ్రీనివాస్, తుడుం రవీందర్, లచ్చిరామ్ నాయక్, రాకేష్ గౌడ్, శివరామ కృష్ణా, ప్యాట్ల మల్లయ్య యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.