China Manja ban: నిర్మల్, జనవరి 7 (మన బలగం): చైనా మాంజా వినియోగం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున చైనా మాంజాపై
నిర్మల్ జిల్లాలో నిషేధం విధించినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. నిషేధం విధించిన చైనా మాంజా అమ్మినా, వినియోగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీలు నిర్వహించి చైనా మాంజా విక్రయదారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చైనా మాంజా వాడడం వలన ప్రజలకు మరియు జంతువులకు ప్రాణాపాయం వాటిల్లే ప్రమాదం ఉన్నదని అన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని పలు దుకాణాలలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.