minister seethakka
minister seethakka

minister seethakka: నాడు సమాజం కోసం.. నేడు సరదా కోసం: తుపాకీ పట్టిన మంత్రి సీతక్క

minister seethakka: నిర్మల్, జనవరి 7 (మన బలగం): సమాజంలో జరుగుతున్న అవినీతి.. అక్రమాలను.. వ్యతిరేకిస్తూ సమ సమాజ స్థాపన కోసం పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ఆనాడు అడవి బాట పట్టిన సీతక్క తుపాకీ పట్టారు. దశాబ్దాల కాలం పాటు ప్రజా ఉద్యమాల్లో పాలుపంచుకున్న సీతక్క నేడు అదే ఒరవడితో రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రజలకు సేవ చేస్తున్నారు. నిర్మల్ పట్టణంలో మూడు రోజులుగా జరుగుతున్న నిర్మల్ ఉత్సవాలలో పాల్గొనేందుకు వచ్చిన సీతక్క ఆటవిడుపుగా తుపాకీ పట్టారు. తుపాకీ పట్టిన తీరు పలువురిలో ఆనాటి రోజులు గుర్తుకు వచ్చేలా చేశాయి. నాడు సమాజం కోసం.. నేడు సరదా కోసం మంత్రి సీతక్క తుపాకీ పట్టి అందరినీ ఆలోచింపజేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *