Kaloji Narayana Rao Jayanti: తెలంగాణ యాసకు, భాషకు ప్రజాకవి, స్వాతంత్ర్య సమరయోధుడు కాళోజి నారాయణరావు జీవం పోశారని నిర్మల్ పట్టణంలోని సోమవార్‌పేట్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముడారపు పరమేశ్వర్ తెలిపారు. కాళోజి జయంతి సందర్భంగా మంగళవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాళోజీ చేసిన రచనలు ప్రజల హక్కులు, సామాజిక చైతన్యం, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం నడిపిన ప్రజావాణి కాళోజీ అని కొనియాడారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి తన రచనలతో కాళోజీ గళమెత్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.