Sports competitions for employees held in Nirmal: తెలంగాణ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జిల్లా ఉద్యోగుల కోసం వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. చెస్, క్యారమ్, టేబుల్ టెన్నిస్ వంటి ఇండోర్ గేమ్స్‌తో పాటు మరికొన్ని ఆటలు ఉత్సాహంగా సాగాయి. ప్రతి విభాగంలో పోటీదారులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ప్రతిభ కనబరిచారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో శ్రీకాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఉద్యోగుల్లో శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం పెంపొందించడంలో క్రీడల ప్రాధాన్యత అమూల్యమని తెలిపారు. ఈ తరహా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమం లో పీడీలు ఎం.శ్రీనివాస్, రమణారావ్, అన్నపూర్ణ, సత్తయ్య, అంబాజీ, భోజన్న, వెన్నెల, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

