Beti Bachao Beti Padao: నిర్మల్, ఫిబ్రవరి 5 (మన బలగం): బేటి బచావో బేటి పడావో కార్యక్రమంపై ప్రతి విద్యార్థినికి అవగాహన తప్పనిసరిగా ఉండాలని జిల్లా లీగల్సేల్ అథారిటీ చైర్మన్ జి.రాధిక అన్నారు. బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా బాలశక్తి కార్యక్రమాన్ని భాగస్వామ్యం చేస్తూ, నిర్మల్ గ్రామీణ కేజీబీవి పాఠశాలో బుధవారం విద్యార్థినులకు పలు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ జి.రాధిక హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బేటి బచావో బేటి పడావో కార్యక్రమం ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న 45 రోజుల కార్యక్రమాల్లో భాగంగా బాలశక్తీ కార్యక్రమాన్ని భాగస్వామ్యం చేస్తూ, విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్, బాల్యవివాహాలు, బాల్య వివాహ నిర్మూలన చట్టం-2006, వివిధ హెల్ప్‌లైన్ నెంబర్లు 100, 1098 ,181, 1930, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులంతా అన్ని అంశాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. విద్యార్థులకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు వివరించారు. విద్యార్థులచే బేటి బచావో బేటి పడావో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీసీపీవో మురళి, మిషన్ శక్తి జెండర్ స్పెషలిస్ట్ జ్యోతి, చైల్డ్ హెల్ప్ లైన్ అధికారి శ్రీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.