Collector B. Satya Prasad: జగిత్యాల ప్రతినిధి, ఫిబ్రవరి 5 (మన బలగం): ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అన్నారు. బుధవారం స్థానిక మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సంబంధిత అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రి రికార్డులను, పరిసరాలను పరిశీలించారు. ఓపీ సేవలు, ఐపీ సేవలు, ల్యాబ్ రికార్డ్స్, ఐపీ రికార్డ్స్ కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు సమయపాలన పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. రోజుకు ఎన్ని ఓపీలను చూస్తున్నారని, సైకాలజీకి సంబంధించిన వార్డును, పిడియాట్రిక్ వార్డు, ఎమర్జెన్సీ వార్డు, గర్భిణులకు సంబంధించి ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారని, నార్మల్ డెలివరీకి సంబంధించి ట్రీట్‌మెంట్ ఎలా ఇస్తున్నారని అని ఆరా తీశారు. ఆసుపత్రిలో పేషెంట్లకు శుభ్రమైన తాగునీరు అందిస్తున్నారా అని తెలుసుకున్నారు. అదే విధంగా పేషెంట్లకు సరఫరా చేసే ఆహారాన్ని నాణ్యమైనది అందిస్తున్నారా లేదా అని పరిశీలించారు. పేషెంట్లకు ఇబ్బంది కలుగకుండా వైద్య సేవలు కల్పించాలని కలెక్టర్ సూచించారు. రోగులకు అన్ని రకాల చికిత్సలకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా అని ఫార్మసీని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో కొత్తగా నిర్మిస్తున్న 50 పడకల క్రిటికల్ కేర్‌ను పరిశీలించి, నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ ప్లాట్ఫామ్ నిర్మాణం మంజూరు చేసి పనులను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డాక్టర్ ఏ.సుమన్ రావు, ఇన్‌చార్జి మెడికల్ సూపరింటెండెంట్, డాక్టర్ యాకుబ్ పాషా, డిప్యూటీ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, ఆర్.ఎమ్.వోలు, వైద్యాధికారులు, ఆస్పత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.