Munurukapu Sangham Election’s: నిర్మల్, జూన్ 6 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేట్ మున్నూరు కాపు సంఘ నూతన కార్యవర్గాన్ని ఆదివారం సంఘ భవనంలో ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మారుగోండ నరేందర్, ఉపాధ్యక్షులుగా అనుముల మోహన్, ప్రధాన కార్యదర్శిగా ఉదిగిరి పోశెట్టి, సంయుక్త కార్యదర్శిగా అనుముల రాజేశ్వర్, కోశాధికారిగా లక్కాకుల గిరిధర్, కార్యవర్గ సభ్యులుగా మగ్గిడి వెంకటి, బొమ్మెడ కిషన్, కుమ్మరి వెంకటి, సల్ల కిషన్, అనుముల రాజేందర్, అయిండ్ల రాజస్వామి, బసవేశ్వర్, ఆదుముల్ల నారాయణ ఎన్నికయ్యారు. బద్రి శ్రీనివాస్, ఎర్రవోతు ముత్తన్న, కొబ్బయి శేషాద్రి, కుమ్మరి ఆనంద్ ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతనంగా ఏర్పడిన కార్యవర్గ సభ్యులను పలువురు శాలువా, పూలమాలతో సత్కరించారు.