Ashada Ekadashi Celebrations at Nirmal: నిర్మల్, జూన్ 6 (మన బలగం): ఆషాడ శుద్ధ తొలి ఏకాదశి పురస్కరించుకొని ఆదివారం నిర్మల్ పట్టణంలోని వైష్ణవ ఆలయాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని అత్యంత ప్రాశస్త్యం కలిగిన దేవరకోట దేవస్థానం, బేస్తార్‌పేట్‌లోని విఠలేశ్వర ఆలయం, వాల్మీకి నగర్ శ్రీ రామాలయం, హరిహర క్షేత్రం సత్యనారాయణ స్వామి ఆలయం చిట్యాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మూలవిరాట్టు, ఉత్సవ మూర్తులకు పంచామృత అభిషేకాలను చేశారు. దేవరకోట దేవస్థానంలో శ్రీ ఆండాళ్ గోష్టి, శ్రీ వైష్ణవ సేవా సంఘం ఆధ్వర్యంలో సామూహిక విష్ణు సహస్ర పారాయణం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర అష్టోత్తర పూజను అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు రామకన్నన్ గోవిందుల శ్రీనివాసాచారి పద్మ, శ్రీదేవి, రాజుల దేవి రాజశేఖర్ ఆలయ అర్చకులు పాల్గొన్నారు.