Nirmal Press Club Felicitation by Telangana Muslim Employees Association: నిర్మల్, జూన్ 6 (మన బలగం): సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని, ప్రజా సమస్యల పరిష్కారంలో వారు చేస్తున్న కృషి ఎనలేనిదని తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జవాద్ హుస్సేన్, ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. ఆదివారం నిర్మల్ ప్రెస్‌క్లబ్ నూతన కమిటీని తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఎంఈఏ) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. స్థానిక భాగ్యనగర్‌లో గల అసోసియేషన్ భవనంలో కమిటీ సభ్యులకు శాలువాలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా టీఎంఈఏ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు జవాద్‌హుస్సేన్, ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ నిర్మల్ అభివృద్ధికి పాత్రికేయులు అందిస్తున్న కృషి గొప్పదని కొనియాడుతూ, కొత్త కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వహీద్‌ఖాన్, విరాసత్‌అలీ, ఇర్ఫాన్‌షేక్, సౌద్‌అలం తదితరులు పాల్గొన్నారు.