భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్న భక్తులు
The Thala Saptami celebrations: నిర్మల్, అక్టోబర్ 30 (మన బలగం): నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె) గ్రామంలోని ప్రసిద్ధిగాంచిన దక్షిణముఖి హనుమాన్ ఆలయంలో ఏడు రోజులుగా కొనసాగుతున్న తాళ సప్తమి వేడుకలు బుధవారం ఘనంగా ముగిశాయి. తాళ సప్తమి వేడుకలు ముగింపు సందర్భంగా హనుమాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బాజా భజంత్రీల మధ్య దిండి ఊరేగింపు కొనసాగింది. అనంతరం కీర్తనలు పాడారు. ఈ సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సప్తమి వేడుకలకు కుభీర్ మండలంతోపాటు మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం తాళ సప్తమి వేడుకలు ఏడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.