Lucky Bhaskar Review: మధ్యతరగతి జీవితానికి దర్పణం పడుతుంది ‘లక్కీభాస్కర్’. వేతన జీవి కష్టాలు హార్ట్ టచింగ్‌గా చూపించారు. చాలీచాలని జీతంతో పడే ఇబ్బందులు, వాటి నుంచి బయటపడేందుకు పడే పాట్లు బిగ్ స్ర్కీన్‌పై నవ్వులు తెప్పించినా అంతర్లీనంగా ఎమోషన్‌ను జోడించారు. చాలా సీన్లకు సగటు ప్రేక్షకుడు పత్రలతో కనెక్ట్ అయి సెంటిమెంట్ ఫీలవుతారు. ఇక కథ విషయానికి వస్తే భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైలోని మగధ ప్రైవేటు బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తుంటాడు. సినిమా మొత్తం 1989-92 మధ్యలో సాగిపోతుంది. ఇంటికి పెద్దకొడుకైన భాస్కర్‌పై అనేక బాధ్యతలు ఉంటాయి. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తాడు. అవసరాల కోసం అప్పులు చేయడం, వాటిని తీర్చలేక అప్పుల వారి నుంచి తప్పించుకోవడం భాస్కర్ జీవితంలో పరిపాటిగా మారుతుంది. ఆయనకు భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు ఉంటాడు. ఇంటి అవసరాల కోసం బ్యాంక్ జాబ్‌తోపాటు పార్ట్‌టైమ్ బిజినెస్ చేస్తుంటాడు. ఇదే సమయంలో ఆంటోని (రాంకీ) కథలోకి ఎంటర్ అవుతాడు. ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేసే ఆంటోనితో కలిసి భాస్కర్ బిజినెస్‌లోకి దిగుతాడు. ఇందు కోసం జాబ్‌ను రిస్క్‌లో పెడతాడు. తన తెలివితేటలతో కోట్లకు పడగెత్తుతాడు. అకస్మాతుగా ఆయన అకౌంట్‌లో పెద్ద మొత్తం డబ్బు వస్తుండడంతో సీబీఐ అధికారుల దృష్టి భాస్కర్‌పై పడుతుంది. ఈ నేపథ్యంలో సీబీఐ నుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నమే కథలో అసలు ట్విస్ట్.
వెంకీ అట్లూరి డైరెక్షన్ కన్నా కథనాన్ని నడిపించిన తీరే సినిమాకు ప్లస్ పాయింట్‌గా చెప్పొచ్చు. సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు అసలు ఎక్కడా బోర్ కొట్టకుండా కథలో బిగువు తగ్గకుండా జాగ్రత్తపడ్డాడు. ‘బలమున్నోడిని కొట్టచ్చేమో కానీ తలెవైనోడిని కొట్టలేం’ లక్కీ భాస్కర్ ట్యా్గ్ లైన్. బ్యాంకింగ్ రంగంలోని లొసుగులను తనకు అనుకూలంగా మలుచుకొని మధ్యతరగతి జీవితం నుంచి సంపన్నుడిగా ఎలా మారాడన్నదే ఈ సినిమా ఇతివృత్తం. ఒక్కో సీన్‌ను అద్భుతంగా మలిచారనడంలో సందేహంలేదు. ప్రేక్షుడిని కథలోకి చొప్పించి అనుభూతి ఫీలయ్యేలా చేసాడు డైరెక్టర్ అట్లూరి. ఎమోషన్ సీన్లకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. సెకండ్ ఆఫ్‌లో గేమ్ స్టా్ర్ట్ కాగానే హీరో ఎక్కడ దొరికిపోతాడేమోనన్న కంగారు ప్రేక్షుడిలో కలుగుతుంది. హీరో పడే టెన్షన్‌ను మనం అనుభూతి చెందుతాం అంటే కథను ఎలా నడిపించారో చెప్పనక్కరలేదు. లక్కీ భాస్కర్ విషయంలో అన్నీ కలిసొచ్చాయి అంతే..!
దుల్కర్ సల్మాన్ తన నటనతో మరోసారి మెస్మరైజ్ చేశారనే చెప్పాలి. మీనాక్షి చౌదరి తన పరిధి మేరకు ప్రేక్షకులకు బాగానే కనక్ట్ అయ్యారు. తన కెరీర్‌కు ఈ మూవీ చాలా ప్లస్ అవుతుంది. సాయికుమార్ సైతం తన నటనతో ఆకట్టుకున్నారు. మిగతా వారు తమ పాత్రకు తగిన న్యాయం చేశారు.
లక్కీబాస్కర్‌కు సంగీతం చాలా ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్ఫెక్ట్‌గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు వెంకీ అట్లూరికి సినిమా ప్లస్‌గా నిలుస్తుంది.