Distribution of Kalyan Lakshmi Cheques: ఇబ్రహీంపట్నం, నవంబర్ 2 (మన బలగం): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పలువురు లబ్ధదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను శనివారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని రైతువేదికలో మండలానికి సంబంధించిన 16 మంది లబ్ధిదారులకు రూ.1,601,856 చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.