MP Arvind sir.. have you forgotten the link road?: ఇబ్రహీంపట్నం, నవంబర్ 2 (మన బలగం): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో లింకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు గ్రామాభివృద్ధి కమిటీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. శనివారం వేములకుర్తి బీజేపీ నాయకుడు గుజ్జే గంగాధర్‌తో కలిసి ఎంపీని కలిసారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి వెళ్లే రహదారి లింకు రోడ్డు కిలోమీటర్ ఎనిమిది వందల మీటర్లు పనులు అటవీ అనుమతులు లేక ఆగిపోయాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గ్రామాన్ని సందర్శించిన సమయంలో రోడ్డును పరిశీలించి మరమ్మతులు, సంబంధిత అనుమతులు ఇప్పిస్తానని ఇచ్చిన హామీ విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేవారు.
దీనిపై స్పందించిన ఎంపీ అరవింద్ అధికారులతో మాట్లాడి లింకు రోడ్డుకు అనుమతులు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మెరపెల్లి సత్యనారాయణ, అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎడిపెల్లి గంగారెడ్డి, ఉపాధ్యక్షుడు గోడీల భుమేశ్ గౌడ్, కోశాధికారి పుప్పాల నరేందర్, రాపర్తి దేవేందర్, కమిటీ సభ్యులు అంకతి రాజన్న, ఎస్కిల శ్రీనివాస్, నూనే సంతోష్, రాధారపు లింగం, గుడ్ల రాజేందర్, పల్లి పెద్దులు, మెగిలి స్వామి దాస్, తరి రాజ్ కుమార్, పట్నం లక్ష్మణ్, అక్కపెల్లి గోపాల్, గాంధారి శ్రీకాంత్, అల్లకుంట లస్మయ్య తదితరులు పాల్గొన్నారు.