Hanuman statue: నిర్మల్, ఫిబ్రవరి 8 (మన బలగం): దిలావర్‌పూర్ మండలంలోని కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని కోనేరు వద్ద ఏర్పాటు చేసిన ధ్యాన హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన శనివారం ఘనంగా నిర్వహించారు. 18 అడుగుల ఎత్తైన ఏక శిలా హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వైభంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య వేడుకలు కొనసాగాయి. హనుమాన్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు హాజరై ప్రతిష్టాపనోత్సవంలో పాల్గొన్నారు. మూడు రోజులపాటు కొనసాగనున్న ప్రతిష్టాపనోత్సవంలో హోమం, ఇతర పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాట చేశారు.
