Bilayi Vagu bridge construction demand Pochampalli Rayadari: నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని పోచంపల్లి – రాయదారి గ్రామాల మధ్యలో గల బిలయి వాగు పైన అలాగే కింద గోధుమల నుంచిపై గోధుమలకు మధ్య దారిలో ఉన్న వాగు పైన వంతెన నిర్మించి, రోడ్డు వేయాలని ఆదివారం గిరిజనులు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌కు విన్నవించారు. ఈ వాగు వర్షా కాలంలో వరద ప్రవాహంతో పొంగి ప్రవహిస్తుందని, చిన్న పాటి వర్షానికి వరద రావటంతో రాకపోకలు నిలిచిపోతున్నాయని వాపోయారు. దీనితో అత్యవసర పరిస్థితిలో హాస్పిటల్‌కు వెళ్లలేక పోతున్నామని, అలాగే విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర పనులు కోసం వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. గతంలో కూడా చెప్పిన పట్టించుకోలేరని ఆవేదన చెందారు. ఇప్పటికైనా తమ బాధను అర్థం చేసుకొని సమస్య పరిష్కారం చేయాలని కోరారు. దీనికి ఎమ్మెల్యే స్పందించి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చందూనాయక్, బధ్యనాయక్, తొడసం కిషన్ నాయక్, తుకారాం, మెస్రం పొల్లు పాల్గొన్నారు.