Perini Nritya Free Training Classes: ఇబ్రహీంపట్నం, నవంబర్ 24 (మన బలగం): ఉచిత పెరిణి నృత్య శిక్షణ తరగతులు ఆదివారం ప్రారంభమయ్యాయి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ కోసం ఫిబ్రవరి 2వ తేదీన భరతముని జయంతి సందర్భంగా మెట్‌పల్లి పటణంలో ద్విశత నృత్యోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనే విద్యార్థులకు మన తెలంగాణ సాంప్రదాయ నృత్యం పేరిణి నృత్యం శిక్షణ ఉచితంగా ఇస్తున్నారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు. ఉచిత క్లాసులు శని, ఆదివారాల్లో మెట్‌పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నారు. వివరాలకు 83412 52285 సెల్ నంబర్‌లో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.
ఈ నృత్య ఉత్సవంలో పాల్గొనదలచిన విద్యార్థులు నవంబర్ 30వ తేదీలోగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఉచిత క్లాసులు మెట్‌పల్లి విద్యార్థులకు మాత్రమే కల్పిస్తున్నట్లు వివరించారు. ద్విశత నృత్యోత్సవ ప్రారంభ క్లాసులో నటరాజ స్వామి పూజలో మీనాక్షి నృత్య కళానిలయం నాట్య గురువు శ్రీవాణి, మీనాక్షి నృత్య కళానిలయం గౌరవ అధ్యక్షులు గుర్రాల గంగాధర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అందె భవితారాణి, కళానిలయం సభ్యులు నునుగొండ నరేందర్, జయలక్ష్మి, అందె మారుతి, సాయభ జైకిషన్, తోట జనార్దన్, గురువులు తదితరులు పాల్గొన్నారు.
