Dharmapuri Temple: జగిత్యాల ప్రతినిధి, మార్చి 7 (మన బలగం): ధర్మపురిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఈనెల 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఎస్పీ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఎలాంటి నేరాలకు తావులేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో, కోనేరు, క్యూలైన్లలో, వాహనాల రాకపోకలు మొదలైన ప్రదేశాల్లో భద్రత ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రఘు చందర్, సీఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్ఐలు ఉదయ్ కుమార్, ఉమసాగర్ ఉన్నారు.