Friends support deceased Rajesh family Khanapur: చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న స్నేహితుడు అనారోగ్యంతో చనిపోయాడు. దీనితో చలించి పోయిన మిత్రులు ఆ కుటుంబానికి అండగా నిలిచి ఆదుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తనపల్లి గ్రామానికి చెందిన గుగ్లవత్ రాజేష్ గత నెలలో అనారోగ్యంతో చనిపోయాడు. ముధోల్ మండలంలోని గురుకుల పాఠశాలలో 2007-2008 సంవత్సరంలో పదో తరగతి వరకు వీరు క్లాస్‌మేట్స్. ఎంతో సరదాగా కలిసి తిరిగి చదుకున్న తమ మిత్రుడు గుగ్లావత్ రాజేశ్ చనిపోయిన విషయం తెలుసుకున్న బ్యాచ్ చెందిన నాటి విద్యార్థులు తట్టుకోలేక పోయారు. ఆ కుటుంబానికి చేయూతనిచ్చేందుకు నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి కుటుంబానికి అండగా ఉండి సహాయం చేయాలనుకున్నారు. తలో చేయి వేసి వారి కుటుంబ అవసరాల నిమిత్తం రూ.50 వేలు జమ చేసి ఆదివారం కుటుంబ సభ్యులకు అందించి ఆదుకున్నారు. భవిష్యత్‌లో కూడా ఏ అవసరం వచ్చిన అండగా ఉంటామని ఓదార్చారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా నిచ్చారు. మిత్రులు నరేష్, సాయన్న, ప్రవీణ్, ప్రశాంత్, రమేష్, శివ కుమార్ తదితరులు పేర్కొన్నారు.
