Transfers of IAS
Transfers of IAS

Transfers of IAS: భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

  • ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్‌లక కీలక పోస్టులు

Transfers of IAS: తెలంగాణ రాష్ర్టంలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. 44 మందికి స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జేఏడీ ముఖ్యకార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి నియమితులయ్యారు. సీఎస్ శాంతి కుమారి ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు పర్యాటక శాఖ ముఖ్య కాదర్శిగా వాణీప్రసాద్ ‌ను నియమించారు. చేనేత, హస్తకళ ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్యర్‌ను నియమించారు.

హ్యాండ్లూమ్స్, టీజీసీవో హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎండీ రామయ్యర్ అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియా బాధ్యతలు నిర్వహించనున్నారు. అటవీ, పర్యావచరణ శాఖల ముఖ్యకార్యదర్శిగా అహ్మద్ నదీమ్‌ను నియమించగా ఆయన టీపీటీఆర్ఐ డీజీగానూ బాధ్యతలు నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఇక్కడ కొనసాగిన రొనాల్డ్ రోస్‌ను విద్యుత్ శాఖ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఆయనకు జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా శ్రీదేవసేను కళాశాల, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌గా ట్రాన్స్‌ఫర్ చేశారు. పశుసంవర్ధక శాఖ ముఖ్యకార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్, అటవీ పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శిగా అహ్మద్ నదీమ్ నియమితులయ్యారు. ఆయనక టీపీటీఆర్ఐ డీజీగా అదనపు బాధ్యతలు కేటాయించారు. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా ఉన్న రిజ్వీని వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శిగా ట్రాన్స్‌ఫర్ చేశారు. జీఏడీ ముఖ్యకార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. దాసరి హరిచందనను రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, హెచ్ఎండీఏ కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్‌ను ట్రాన్స్‌ఫర్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *