- 17,727 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు
SSC CGL 2024 Recruitment Notification: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 17,727 పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగాల ఖాళీలకు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inలో పొందుపరిచారు. జూన్ 24వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్ 2024 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము చెల్లించడానికి జూలై 25వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఆగస్టు 10, 11 తేదీల్లో దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు.
SSC CGL అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఇన్‌స్పె్క్టర్ (ఎగ్జామినర్), సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి గ్రూప్ ‘బీ’, గ్రూప్ ‘సీ’ పోస్టులు భర్తీ చేయనున్నారు.
అర్హతలు ఇవే..
18 నుంచి 32 సంవత్సరాలలోపు వయస్సు గల గ్రాడ్యుయేట్లు అర్హులు. టైర్-1, టైర్-2 విధానంలో ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ / అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ డిగ్రీ, CA / CS / MBA /కాస్ట్ అండ్ మేనేజింగ్ అకౌంటెంట్ / కామర్స్ / బిజినెస్ స్టడీస్‌లో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (JSO) పోస్ట్ కోసం గుర్తింపు పొందిన సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (12వ తరగతిలో గణితంలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు) కలిగి ఉండాలి.
జీతం ఎంతంటే?
అభ్యర్థిని ఎంపిక చేసి పోస్టును బట్టి వేతనాన్ని నిర్ణయిస్తారు. గ్రూప్ -A పోస్టులకు ప్రారంభ వేతనం రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు నెలసరి వేతనం చెల్లిస్తారు. గ్రూప్ – B పోస్టులకు రూ.35,400 నుంచి రూ.1,12,400 ఉంటుంది. గ్రూప్-C జాబర్స్‌కు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు నెలసరి జీతం ఉంటుంది.