Memorandum of Secretaries
Memorandum of Secretaries

Memorandum of Secretaries: పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలి

Memorandum of Secretaries: నిర్మల్, అక్టోబర్ 29 (మన బలగం): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పంచాయతీ సెక్రటరీలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కుబీర్‌కు వచ్చిన డీపీవో శ్రీనివాస్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా.. పలువురు పంచాయతీ సెక్రెటరీలు మాట్లాడుతూ.. ప్రత్యేక పాలన ఏర్పడినప్పటి నుంచి అరకొర జీతాలతో కాలం వెళ్లదీస్తూ అధికారుల ఒత్తిడితో గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎఫ్ఎంఎస్ ద్వారా జమ చేస్తున్న చెక్కులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండడం 18 నెలలుగా రాష్ట్ర ఆర్థిక సంఘం, కేంద్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామపంచాయతీ నిర్వహణ ఎలా చేయాలో తెలియక తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వాలు స్పందించి నిధులు విడుదల చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకంలో పర్యవేక్షులుగా ఉంచాలని, సామాజిక తనిఖీలో బాధ్యులను చేయవద్దని తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లు లేని గ్రామ పంచాయతీలలో వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీపీవోకు అందజేశారు. పంచాయతీ సెక్రటరీలు విజయ్, సంజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *