MLC Elections: జగిత్యాల ప్రతినిధి, ఫిబ్రవరి 26 (మన బలగం): జగిత్యాల పట్టణంలోని మినీ వివేకానంద స్టేడియం లోని ఎమ్మెల్సీ ఎన్నికలు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పర్యవేక్షించారు. బుధవారం రోజున వివేకానంద మినీ స్టేడియం ఎమ్మెల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లను క్షేత్రస్థాయి లో రూట్ బస్సు లను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 71, పోలింగ్ కేంద్రాల్లో 53, పట్టభద్రుల పోలింగ్ కేంద్రాల్లో 20, ఉపాధ్యాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో మొత్తం పట్టభద్రుల ఓటర్స్ 35 వేలు 280 మంది పట్టభద్రులు ,17 వందల 69, మంది టీచర్స్ ఓటర్ ఉన్నారని తెలిపారు. గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అన్నారు.12 సెక్టర్లలో ప్రతి రూట్ బ్యాలెట్ బాక్సులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందని అన్నారు. ఎన్నికలలో ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డుతో పాటు, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని గుర్తుగా చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత తో 144 సెక్షన్ అమలు ఉంటుందని తెలిపారు. ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.ఈకార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్, జిల్లా ఎలక్షన్ అధికారులు ఆర్డీవోలు సిబ్బంది పాల్గొన్నారు.