A single village has six teachers: నిర్మల్, అక్టోబర్ 27 (మన బలగం): డీఎస్సీ 2024లో నూతనంగా ఉపాధ్యాయ వృత్తిలోకి ఎంపికైన ఆరుగురు ఉపాధ్యాయులను చించోలి(బి) గ్రామస్తులు ఆదివారం ఘనంగా సన్మానించారు. సారంగపూర్ మండలం చించోలి (బి) గ్రామంలో ఒకేసారి ఆరుగురు ఉపాధ్యాయుగా ఎంపికవడం తమ గ్రామానికి గర్వకారణం అని, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది మీరే అని గ్రామస్తులు కొనియాడారు. అనంతరం ఎంపికైన ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నల్ల రాం శంకర్ రెడ్డి, వెంకటేశ్, నారాయణ, గణేశ్ గ్రామస్తులు పాల్గొన్నారు.