Devulapalli Ramesh selected for Sahiti Kiriti National Literary Award: సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాల తెలుగు అతిథి ఉపాధ్యాయుడు దేవులపల్లి రమేశ్ జాతీయస్థాయి శ్రీ శ్రీ కళావేదిక అందించే ‘సాహితీ కిరీటి’ పురస్కారానికి ఎంపికయ్యారు. దేవులపల్లి రమేశ్ తెలుగు సాహిత్యానికి చేస్తున్న కృషిని గుర్తించి ఈ పురస్కారం అందిస్తున్నట్లు కళావేదిక మేనేజింగ్ డైరెక్టర్, కత్తిమండ ప్రతాప్ కుమార్, జాతీయ యువజన విభాగం అధ్యక్షుడు గరిమెళ్ల రాజేంద్ర ప్రసాద్, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం తెలిపారు. సాహితీ పురస్కారం రావడంపై రమేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 28వ తేదీ ఆదివారం హైదరాబాద్ బిర్లా ఆడిటోరియంలో జరిగే సాహితీ పట్టాభిషేక మహోత్సవంలో పురస్కారం ప్రదానం చేయనున్నారు. రచయిత రమేశ్‌ను పలువురు సాహితీ వేత్తలు అభినందించారు.