Donation of library study tables and medical kits to students in Khanapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్‌లో గల ప్రభుత్వ హైస్కూల్‌లో పని చేస్తున్న తెలుగు ఉపాధ్యాయులు వెన్నం అంజయ్య శనివారం విద్యార్థులకు మెడికల్ కిట్లు, లైబ్రరీ స్టడీ టేబుల్స్, పిల్లలు కూర్చునే మ్యాట్‌లను అందచేసి తన ఉదారతను చాటుకున్నారు. అలాగే రెండువేల విలువచేసే మెడికల్ కిట్లు, నెయిల్ కట్టర్లు, విద్యార్థినులకు అందచేసారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బోనగిరి నరేందర్ రావు మాట్లాడుతూ, విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. అంతే కాకుండా ఇదే రోజు కాగజ్‌నగర్ మండలం బారెగూడ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు లైబ్రరీలో కూర్చుండి చదువుకునే విధంగా ఐదు వేల విలువచేసే స్టడీ టేబుల్స్, కూర్చునే మ్యాట్‌ను అందించారు. ఈ సందర్భంగా ఆయనను ప్రధానోపాధ్యాయులు బోనగిరి నరేందర్ రావు, కుర్ర శేఖర్, తొంటి శంకర్, షేక్ ఇమ్రాన్, జాగ్డండ్ లక్ష్మణ్ రావు, రాపర్తి కిషన్ ప్రసాద్, బాదోల్ల రవి కుమార్ తదితరులు అభినందించారు.
