Savitribai Phule Jayanti: ధర్మారం, జనవరి 3 (మన బలగం): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో సావిత్రి బాయి ఫూలే చిత్రపటానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి అణగారిన వర్గాల్లో విద్యా వ్యాప్తి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రి బాయి ఫూలే అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆమె ఆశయ సాధనకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ధర్మారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.