Kondagattu: మల్యాల, మార్చి 20 (మన బలగం): కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఆవరణంలో గిరిప్రదక్షిణ రోడ్డుకు అటవీ శాఖ అధికారులతో కలిసి గురువారం చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేశారు. భక్తుల సౌకర్యార్థం రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆలయ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బత్తిని మల్లేశ్వరి, శ్రీనివాస్ గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.