Bandh: బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన అఘాయిత్యాలు, మారణకాండకు నిరసనగా మంగళవారం నిర్మల్ బందుకు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. బంగ్లాదేశ్లో హిందువులను అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేయడం, మహిళలను చిత్రహింసలకు గురిచేసిన సంఘటనలకు నిరసనగా ఇచ్చిన బందుకు అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ పాటించి సహకరించాలని వారు కోరారు. బంద్ పిలుపుతో పాఠశాలలు సెలవు ప్రకటించాయి.
ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బంద్ పిలుపునిచ్చారు. దిలావర్‌పూర్ గ్రామ శివారులో ఫ్యాక్టరీని నిర్మించడం వల్ల కాలుష్యం ఏర్పడడంతో ప్రజలు, పంట భూములకు ఇబ్బందులు ఎదురవుతాయని దిలావర్పూర్ గ్రామస్తులు మొదటి నుంచి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ ఫ్యాక్టరీ యజమాన్యం పట్టించుకోకుండా పనులు కొనసాగించడంతో మంగళవారం ఇతనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ వ్యతిరేక కమిటీ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం బంద్‌కు వ్యాపార సంస్థలు సహకరించాలని కోరారు.