Petition of Congress leaders to Tehsildar: ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 20 (మన బలగం): బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఇబ్రహీంపట్నం తహసీల్దార్ ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌పై బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇండియా కూటమి సభ్యులు చేపట్టిన నిరసనను అడ్డుకొని ప్రతిపక్ష నేత, జాతీయ కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీపై దాడికి పాల్పడి, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తీరుపై మండిపడ్డారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు గూడ శ్రీకాంత్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు దూదిగం గంగాధర్, ఏఎంసీ చైర్మన్ బొరిగం రాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎలాల వెంకట రెడ్డి, కాశిరెడ్డి భాస్కర్ రెడ్డి, ముక్కెర వేణుగోపాల్, మాజీ సర్పంచులు లక్కం నర్సక్క, గంగాధర్, మాజీ ఉప సర్పంచులు రాజేశ్, రాజ్ కుమార్, నల్ల రామరాజు, ఇట్టేడి శ్రీనివాస్, రామానుజం, గుమ్మల రమేశ్, జలేశ్, రమేశ్, బండిరాజేశ్, రాజు, సాగర్, మహిపాల్, అశోక్, వాల్గొట్ నరేశ్, హరీశ్ యాదవ్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.