CPM demands solution for urea shortage in Khanapur: రాష్ట్రంలో, దేశంలో యూరియా కొరత వలన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నరేంద్ర మోడీ సర్కార్ రైతులకు సరిపడే యూరియా పంపిణీ చేయకపోవడం వలన వారి పరిస్థితి దారుణంగా మారిందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. నానో యూనియన్ ప్రోత్సహించడం కోసం రైతుల గోస పుచ్చుకుంటున్నారని, రోజుల తరబడి లైన్‌లో నిలబడినా యూరియా మాత్రం లభించడం లేదని అన్నారు. యూరియా కొరతను తీర్చడంలో కేంద్ర ప్రభుత్వ విఫలమైందన్నారు. యూరియా బస్తాలు సంపాదించడం పెద్ద పనిగా మారిందని, యూరియా దొరికితే ఎవరెస్టు శిఖరం ఎక్కినంత సంబర పడవలసి వస్తుందని అన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఇప్పటికైనా సకాలంలో యూరియా పంపిణీ చేసి రైతులను ఆడుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులు బొమ్మెన సురేష్, జిల్లా కమిటీ సభ్యులు నాగెల్లి నర్సయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు డాకురు తిరుపతి, సుంచుల నారాయణ పాల్గొన్నారు.