- లైన్‌లో నిలబడి తంటాలు పడిన రైతులు
- ప్రభుత్వం పూర్తి స్థాయిలో సరఫరా చేయాలని విన్నపం
Urea shortage in Nirmal district: రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. వరి నాట్లు వేసుకున్న రైతులకు తరువాత కావలిసిన యూరియా సకాలంలో అందకపోవటం వలన వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఒక్క యూరియా లారీ వస్తే వందల మంది రైతులు ఎగబడుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తెన్‌పెల్లి, ఖానాపూర్ సహకార సంఘాల్లో శనివారం యూరియా లారీ రావటంతో యూరియా బస్తాల కోసం రైతులు బారులు తీరారు. గంటల తరబడి లైన్‌లో ఉండాల్సి వచ్చింది. దాదాపు వారం రోజుల తరువాత యూరియా రావడంతో విషయం తెలుసుకున్న రైతులు సహకార సంఘానికి చేరికొని ఒక బస్తా యూరియా కోసం అనేక ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి పడిగాపులు కాసి ఎకరానికి ఒక్క సంచి మాత్రమే ఇవ్వటంతో ఇంకా అవసరం ఉన్న అధికారులు ఇచ్చిన ఆ ఒక్క సంచిని గత్యంతరం లేక తీసుకపోతున్నారు. ఇవి సరిపోదని ఇంకా లారీలు అవసరం అయిన మేరకు ప్రభుత్వం పంపించాలని, రైతులకు సరిపడా యూరియా అందజేసి ఆదుకోవాలని రైతులు కోరారు.