- సబ్జెక్టుపై పట్టు.. పోటీ పరీక్షల్లో రాణించేందుకు తొలిమెట్టు
- కొనసాగుతున్న స్మార్ట్ తరగతులు.. విద్యార్థినుల భవితకు బంగారు భవిష్యత్తు
- రాజన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక చొరవతో కేజీబీవీల్లో ప్రత్యేక శిక్షణ
government schools: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, మార్చి 9 (మన బలగం): చూడడానికి సర్కారు బడులు కానీ వాటిలో కార్పొరేట్ స్థాయి వసతులు అందిస్తూ ఆంగ్ల మాధ్యమం ద్వారా గుణాత్మక విద్యను అందిస్తుంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల్లో పట్టు సాధించేలా.. పోటీ పరీక్షల్లో రాణించేలా ప్రత్యేక ప్రణాళిక ప్రకారం శిక్షణ కొనసాగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక చొరవతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) ల్లోని విద్యార్థులకు ఉత్తమ బోధనా తరగతుల ప్రక్రియ ముందుకు సాగుతుంది. విద్యార్థులకు భవితకు బంగారు బాట పడనుంది.
13 విద్యాలయాల్లో ..
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రభుత్వ విద్యా సంస్థలు, దవాఖానాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో తరచూ తనిఖీలు చేస్తూ పాఠ్యాంశాల బోధన, వసతులు తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ పాఠ్యాంశాలపై ఆరా తీస్తున్నారు. స్వయంగా పలు పాఠ్యాంశాలు బోధిస్తూ విద్యార్థులు అనుమానాలను నివృత్తి చేస్తున్నారు ఇందులో భాగంగా ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సబ్జెక్టుపై పట్టు సాధించేలా.. పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. బేటి బచావో బేటి పడావో కింద జిల్లాలోని 13 కస్తూర్బా గాంధీ బాలికాల విద్యాలయాల్లోని 8, 9, 10వ తరగతులు, ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ కు చెందిన మొత్తం 3,265 విద్యార్థులకు రూ. 50 లక్షల నిధులతో ఐఎఫ్ పీ( ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్) ద్వారా ఇంటర్నెట్ సదుపాయంతో గణితం, ఫిజిక్స్, సైన్స్ ఇతర పాఠ్యాంశాల్లో అన్ అకాడమీ ద్వారా ఆంగ్ల మాధ్యమంలో బోధించేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రతి రోజు గంట పాటు వీడియో క్లాసులు విద్యార్థులకు విద్యాలయాల టీచర్ల సమక్షంలో చూయిస్తున్నారు. ఆయా సబ్జెక్టుల్లో వచ్చే అనుమానాలను ప్రత్యేక సమయం తీసుకొని నివృత్తి చేసుకుంటున్నారు
పోటీ పరీక్షలే లక్ష్యం
ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రధానంగా పేద, మధ్య, ఇతర తరగతి విద్యార్థులు చదువుతారు. వారికి ఐఐటీ, జేఈఈ, నీట్ ఫౌండేషన్ కోర్సు, ఇతర ఉన్నత సంస్థల్లో ప్రవేశాలు పొందేలా శిక్షణ అందిస్తున్నారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తుండడంతో వారి భవిష్యత్తుకు బంగారు బాటలు పడుతున్నాయి. ఉత్తమ సంస్థలో ఆధ్వర్యంలో కొనసాగుతుండడంతో విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయా సబ్జెక్టుల్లో పట్టు సాధిస్తున్నారు అన్ని పోటీ పరీక్షల్లో రాణించేలా తర్ఫీదు పొందుతున్నారు. తమ పిల్లలకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాల శిక్షణాలతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులకు ఎంతో మేలు: సందీప్ కుమార్ ఝా, రాజన్న సిరిసిల్ల కలెక్టర్

అకాడమీ ఆధ్వర్యంలో ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది విద్యార్థులు సబ్జెక్టుపై పట్టు సాధిస్తూనే పోటీ పరీక్షల్లో రాణించేందుకు ఉపయోగపడుతుంది విద్యార్థులందరూ శిక్షణను సద్వినియం చేసుకొని అన్ని పరీక్షల్లో రాణించాలి ఉన్నత స్థానాలకు తల్లిదండ్రులు ఆశలు ఆశయాలు నెరవేర్చాలి.
సబ్జెక్టులపై మంచి అవగాహన: జీ హర్పిత, బైపిసి సెకండ్ ఇయర్ విద్యార్థిని, రుద్రంగి కేజీబీవీ

మాకు ప్రతిరోజు తరగతి గదులు గంట పాటు శిక్షణ కొనసాగుతుంది. ప్రతి సబ్జెక్టులో బేసిక్ అంశాల నుంచి వివరణ ఇస్తున్నారు దీంతో ప్రతి అంశంపై సంపూర్ణ అవగాహన ఏర్పడేందుకు ఉపయోగపడుతుంది. అనుమానాలను సైతం నివృత్తి చేస్తున్నారు.
కలెక్టర్ కు కృతజ్ఞతలు: పీ శ్రీహర్షిణి, 10 వ తరగతి, సిరిసిల్ల కేజీబీవీ

మాకోసం ప్రత్యేక ప్రణాళిక ప్రకారం శిక్షణా తరగతులు అందిస్తున్నారు దీంతో మేము పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు ఒక మార్గం ఏర్పడుతుంది. మా ఉపాధ్యాయుల సమక్షంలో బోధన కొనసాగుతుండడంతో ఎంతో మేలుcచేకూరుతుంది మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు.