HIV AIDS Awareness Program for Students in Nirmal: నిర్మల్ రూరల్ మండలంలోని చిట్యాల్, వెగ్వాపేట్, కొండాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ఐసీటీసీల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూపర్‌వైజర్ వి.అనిల్ కుమార్ మాట్లాడుతూ.. హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. హెచ్ఐవీ నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు నిరంతరం పనిచేస్తున్నాయని వివరించారు. ఈనెల 21న హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధిపై క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో విద్యార్థులు గెలుపొంది బహుమతులు అందుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, విజయభాస్కర్, వెంకటేశ్, ఉపాధ్యాయులు హరిత, ఐసీటీసీ కౌన్సిలర్లు సుదర్శన్, ఎల్లేష్, శ్రీనివాస్, షూర్ ఎన్జీవో పీఎం మల్లికార్జున్, వైఆర్జి కేర్ సూపర్‌వైజర్ శశిమాల, లింక్ వర్కర్ శశికళ, పాఠశాలల విద్యార్థులు ఉన్నారు.