Banswada Ration Card Distribution 2025: బాన్సువాడ, మన బలగం: బాన్సువాడ పట్టణ కేంద్రంలోని లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణ మండపం (రెడ్డి సంఘం)లో శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. బాన్సువాడ, నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాలకు చెందిన నూతన లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఉమ్మడి బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు దుర్గం శ్యామల శ్రీనివాస్, బాన్సువాడ, నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.