Telangana business leader recognition: నిర్మల్, జులై 26 (మన బలగం): రాష్ట్ర రాజధానిలో నిర్మల్ వాసికి అరుదైన గౌరవం దక్కింది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామానికి చెందిన వంగ చిన్నారెడ్డి కూతురుని వివాహం చేసుకొని యోగేశ్వర్ రెడ్డి వ్యాపార రీత్యా హైదరాబాదులో స్థిరపడ్డారు. శుక్రవారం హైదరాబాదులో జరిగిన రోటరీ క్లబ్ చంగే మేకర్స్ అసోసియేషన్‌కు యోగేశ్వర్ రెడ్డి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. రెండు సంవత్సరాల కాలంపాటు ఈ కమిటీ కొనసాగుతుందని ఆయన తెలిపారు. తనకు అరుదైన గౌరవం దక్కేందుకు సహకరించిన చంగే మేకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులుగా ఎన్నికైన యోగేశ్వర్ రెడ్డికి నిర్మల్‌కు చెందిన వంగ రవీందర్ రెడ్డితో పాటు పలువురు నేతలు, కాంట్రాక్టర్లు శుభాకాంక్షలు తెలిపారు.