Samantha: హీరో నాగచైతన్యతో విడాకుల తరువాత సమంతకు సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సమంత డేటింగ్‌లో ఉన్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ‘ది ఫ్యామి లీ మాన్’ వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ థ్రిల్లర్ అండ్ యాక్షన్ వెబ్ సిరీస్‌లో సమంత నటించారు. ఈ సందర్భంలోనే వీరి మధ్య ప్రేమచిగురించిందన్న ప్రచారం జరుగుతోంది. నాగచైతన్యతో విడాకుల తరువాత ఒంటరిగా ఉంటున్న సమంత ప్రస్తుతం జోడీతో కనిపించడం అందరినీ షాకింగ్‌కు గురిచేసింది. వారం రోజుల క్రితమే నాగచైతన్య శోభితల నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. చైతు నిశ్చితార్థం అయిన రోజుల వ్యవధిలోనే సమంత డేటింగ్‌లో ఉన్న వార్తలు చక్కర్లు కొట్టడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
Blog / తాజా వార్తలు / వినోదం